బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం!

22 Aug, 2022 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయం బలహీనపడింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లడంతో రాష్ట్రానికి ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఇక రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 23 డిగ్రీల సెల్సియస్‌ మధ్యన ఉంటాయని అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు