వక్ఫ్‌ ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలి

2 Oct, 2021 02:01 IST|Sakshi

జీరో అవర్‌లో అక్బరుద్దీన్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జాదారుల పాలవుతు న్నాయని, వీటిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో వక్ఫ్‌ బోర్డు ఆస్తులున్నాయని, వీటిలో 50 శాతానికిపైగా ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జీరో అవర్‌లో అక్బరుద్దీన్‌ మాట్లాడారు.

పల్లెల పేర్ల మార్పుపై రగడ ! 
పల్లెసీమలకు వందల ఏళ్లుగా ఉన్న పేర్లను యథాతథంగా కొనసాగించాలని, మార్చాల్సిన అవసరం లేదని ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ ను సులభతరం చేస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి వంటి పేర్లు సైతం మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణబిల్లు –2021ను ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.  ప్రశాంత తెలంగాణలో ఈ ప్రతిపాదనలతో సమస్యలు వస్తాయని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క అన్నారు. 

మరిన్ని వార్తలు