జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఆలేరు 

29 Apr, 2022 02:42 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ 2021 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఎంపికైంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన 10 పోలీస్‌ స్టేషన్లలో ఆలేరు నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర హోం కార్యదర్శి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం ఆలేరు పోలీసులకు పంపించారు.

గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్‌ కేటగిరీలో ఆలేరు పీఎస్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, మహిళల రక్షణకు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐ ఇద్రీస్‌ అలీతోపాటు సిబ్బందిని అభినందించింది. జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై రాచకొండ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు