హైస్పీడ్‌లో మెట్రో పనులు.. రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్‌ మధ్య అలైన్‌మెంట్‌ ఖరారు!

19 Dec, 2022 02:34 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి మధ్యన అలైన్‌మెంట్‌ ఖరారు,  గ్రౌండ్‌ డేటా సేకరణ తదితర పనులను వేగవంతం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మార్గంలో జరుగుతున్న సర్వే పనులను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి నార్సింగి జంక్షన్‌ వరకు ఎయిర్‌పోర్ట్‌ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు.   

దిశానిర్దేశం ఇలా..  
- మెట్రో స్టేషన్లు  ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కారిడార్‌ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఈ కారిడార్‌ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ,  శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఎనీ్వఎస్‌ రెడ్డి ఆదేశించారు.  

- ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో  చేరుకునేలా ఈ కారిడార్ను డిజైన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఇప్పటికే  ఆకాశహరŠామ్యలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో  మెట్రో స్టేషన్లు, స్కై వాక్‌ల నిర్మాణం ఉండాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్‌ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. 

- రాయదుర్గ్‌ స్టేషన్‌ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు స్టేషన్‌ను పొడిగించనున్న నేపథ్యంలో.. నూతన  టెరి్మనల్‌ స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో స్టేషన్‌లను అనుసంధానానికి మార్గాలను అన్వేíÙంచాలన్నారు. స్థలాభావం కారణంగా ఐకియా భవనం తర్వాత రెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

- మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్‌ పోర్ట్‌ కొత్త రాయదుర్గ్‌ స్టేషన్, పొడిగించిన  కొత్త బ్లూ లైన్‌  స్టేషన్‌ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్‌ చేయాలని అన్నారు. జేబీఎస్‌ స్టేషన్, అమీర్‌పేట్‌ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు. ఈ రూట్లో  ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై ఓల్టేజ్‌ భూగర్భ విద్యుత్‌ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా చూడాలన్నారు.   

- బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ మీదుగా ఎయిర్‌పోర్ట్‌ మెట్రో వయాడక్ట్‌ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేయాలని సూచించారు. హై ఓల్టేజ్‌ అండర్‌గ్రౌండ్‌ కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా చూడాలి. సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్‌ ర్యాంప్‌ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్‌ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు.   

- బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద మెట్రే స్టేషన్‌ను నిర్మించే సమయంలో.. ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో  నిర్మించనున్న బీహెచ్‌ఈఎల్‌– లక్డీకాపూల్‌ మెట్రో కారిడార్‌ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండీ సూచించారు.  నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వద్ద మెట్రో స్టేషన్‌ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్‌ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలు కలి్పంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు.  
∙నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్‌ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్‌ స్థానాన్ని ప్లాన్‌ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌కు ఆవల నుంచి వచ్చే ప్రయానికులను అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు