Army Sports Company Selection Trials: ఫిబ్రవరిలో ఆర్మీ స్పోర్ట్స్‌ కంపెనీ సెలక్షన్స్‌ 

21 Jan, 2022 04:45 IST|Sakshi

కంటోన్మెంట్‌: ఇండియన్‌ ఆర్మీ ఆర్టిల్లరీ సెంటర్‌ ఆర్మీ బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీలో స్పోర్ట్స్‌ క్యాడెట్‌ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. 8 నుంచి 14 ఏళ్ల లోపు బాయ్స్‌కు ఫిబ్రవరి 1 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

అథ్లెటిక్స్‌ (స్ప్రింట్స్, జంప్స్‌), విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు త్రివేండ్రమ్, జైపూర్, కౌశాంబీ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు గుంటూరు, భివానీ (హరియాణా) జలంధర్‌ (పంజాబ్‌)లలో ప్రాథమిక ఎంపిక ఉంటందని తెలిపారు. హ్యాండ్‌ విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు గోరఖ్‌పూర్‌ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఒంగోలు, భివానీ (హరియాణా)లో.. జలంధర్‌ (పంజాబ్‌)లో ప్రాథమిక స్థాయి ఎంపిక కొనసాగుతుందన్నారు.

మరిన్ని వార్తలు