డ్యూటీ మీట్‌లో సత్తా చాటిన తెలంగాణ పోలీస్‌ 

18 Feb, 2023 01:58 IST|Sakshi

డీజీపీ అంజనీకుమార్‌ హర్షం  

సాక్షి, హైదరాబాద్‌: జాతీ­య స్థాయిలో నిర్వహిం­చిన ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీ­సులు సత్తా చాటా­రు. ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన 66వ ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో నాలుగు విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు దక్కాయి. రిటన్‌ టెస్ట్‌ విభాగంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ సీసీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎ.మన్మోహన్‌ కు బంగారు పతకం లభించింది.

పోలీస్‌ వీడియోగ్రఫీ విభాగంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎ.అనిల్‌కుమార్‌కు రజతపతకం, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ విభాగంలో ఎస్‌ఐబీ (ఇంటెలిజెన్స్‌ విభాగంలో) ఎస్సైగా ఉన్న బి.వెంకటేశ్‌కు, ఇంటెలిజెన్స్‌ సీఐ సెల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న బి. విజయ్‌లకు వెండి పతకాలు లభించాయి. యాంటీ సబోటేజ్‌ చెకింగ్‌ (బాంబులను గుర్తించేది) విభాగంలో తెలంగాణ పోలీస్‌ శాఖకు మూడో స్థానం లభించింది. పోలీస్‌ డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసులకు పతకాలు రావడంపై డీజీపీ అంజనీకుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పతకాలు గెలిచిన అధికారులను ఆయన అభినందించారు.   

మరిన్ని వార్తలు