హైదరాబాద్‌కు అరుదైన గౌరవం

23 Mar, 2021 03:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎఫ్‌ఏవో గుర్తించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఇది గర్వకారణమని, హరితహారం విజయని అన్నారు. సభ్యులు యాదగిరిరెడ్డి, రేఖా నాయక్‌లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్నే సీఎం రీడిజైనింగ్‌ చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ సభ్యుడు యాదగిరిరెడ్డి ప్రశంసించారు. ఇక ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం చెబుతూ విద్యా సంస్థలను 100 శాతం గ్రీనరీ చేయాలన్న లక్ష్యం ఉందన్నారు.

2015 నుంచి ఇప్పటివరకు 179.08 కోట్ల మొక్కలు నాటామని, పునరుజ్జీవనంతో కలిపి మొత్తం 217 కోట్ల మొక్కలు ఇప్పుడు నిలబడ్డాయన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు చెట్ల కొమ్మలు నరకకుండా ఆదేశాలు ఇస్తామన్నారు. 10,750 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. 

మరిన్ని వార్తలు