అమరావతి భూముల కుంభకోణం: నారాయణను ప్రశ్నించిన సీఐడీ

6 Mar, 2023 20:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నారాయణ నివాసానికి చేరుకున్న అధికారులు.. ఆయనను ప్రశ్నించారు. నారాయణ సతీమణి, ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ యజమానిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కూకట్‌పల్లి లోధా అపార్ట్‌మెంట్‌లో మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో ఏపీ సీఐడీ అధాకారులు  ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

నారాయణ సంస్థల నుంచి రామకృష్ట సంస్థలోకి నిధుల మళ్లించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారుల దర్యాప్తులో బినామీల పేర్లపై అమరావతిలో అసైన్డ్‌ భూముల కోనుగోలు చేసినట్లు తేలింది. ఈ దందాలో నారాయణ అప్పటి మంత్రులు, వారి బినామీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అక్రమంగా అసైన్డ్‌ భూముల కొనుగులు చేసినట్లు గుర్తించారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఈ భూముల కొనుగోలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది.

150 ఎకరాల అసైన్డ్‌ భూముల అక్రమ కొనుగోలుపై దర్యాప్తు
150 ఎకరాల అసైన్డ్‌ భూముల అక్రమ కొనుగోలుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాజధాని పరిసరాల్లో 65. 50 సెంట్ల భూమి నారాయణ కొనుగోలు చేశారు. ఆవుల ముని శంకర్‌ పేరు మీ 4.2 కోట్ల విలువగల భూమి నారాయణ కొనుగోలు చేశారు. 2017 జూన్‌, జూలై, ఆగస్టులలో భూములు నారాయణ కొనుగోలు చేశారు. వీటితో పాటు పొట్టూరి ప్రమీల పేరు మీద, రావూరి సాంబశివరావు పేరు మీద భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు సందర్భంగా ముగ్గురి అకౌంట్లలోకి భారీగా నిధులు మళ్లించారు.

దీనిలో భాగంగా గతంలో నారాయణ కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలో సైతం సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు బ్యాంకు లావాదేవీలు, మణి కూటింగ్‌ పోన్‌ కాల్స్‌ రికార్డ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. తమవారికి లాభం చేకూరేలా అలైన్‌మెంట్‌ డిజైన్లు నారాయణ మార్చారు. నారాయణ ఎడ్యుకేషన్‌ సొపైటీ, నారాయణ లెర్నింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రామనారాయణ ట్రస్టు ద్వారా 17. 5 కోట్ల నిధులు మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు సైతం భారీగా నిధుల మళ్లించి, ఆ నిధులను అసైన్డ్‌ భూమి రైతులకు చెల్లించారు.

చదవండి: సాత్విక్‌ కేసు: రోజు స్టడీ అవర్‌లో జరిగింది ఇదే.. పోలీసుల రిపోర్ట్‌

మరిన్ని వార్తలు