అంబేడ్కర్‌ విగ్రహం నమూనా విడుదల

17 Sep, 2020 04:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసినట్లు సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలైనట్లు తెలిపారు. మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్‌తో కలసి బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో విగ్రహం నమూ నాను కొప్పుల ఈశ్వర్‌ విడుదల చేశారు.

హుస్సేన్‌సాగర్‌ తీరంలో రూ.140 కోట్ల వ్య యంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. 45.5 అడుగుల వెడల్పుతో ఏర్పాటయ్యే విగ్రహానికి 791 టన్ను ల స్టీలు, 96 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగిస్తామని తెలిపారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పార్కులో అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు