అమ్నీషియా పబ్‌ కేసు: ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరు

4 Aug, 2022 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు బెయిల్‌ లభించింది. సాదుద్దీన్‌కు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో జువైనల్‌లో ఉన్న అయిదుగురు మైనర్‌ నిందితులకు తెలంగాణ హైకోర్టు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత వారమే పబ్‌ కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.
చదవండి: ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే!

మరిన్ని వార్తలు