తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా

23 Aug, 2021 18:31 IST|Sakshi

డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్‌చెరువు అంగన్‌వాడీల్లో 32 ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్‌ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 32
► పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ టీచర్‌–08, అంగన్‌వాడీ ఆయా–24.

► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021

► వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in

యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్‌వాడీల్లో 57 పోస్టులు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 57
► పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ టీచర్లు–08, అంగన్‌వాడీ ఆయాలు–45, మినీ అంగన్‌వాడీ టీచర్లు– 04.

► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్‌–10, రామన్నపేట–15.

► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021
► వెబ్‌సైట్‌: https://wdcw.tg.nic.in

డీహెచ్‌ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు
తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్‌ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 10
► పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–04, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఫార్మసిస్ట్‌–05.

► సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: అర్హత: ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

► ల్యాబ్‌ టెక్నీషియన్‌: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

► ఫార్మసిస్ట్‌: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డీఎంఎల్‌టీ/బీఎస్సీ(ల్యాబ్‌ టెక్నీషియన్‌) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్‌ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021
► వెబ్‌సైట్‌: https://jagtial.telangana.gov.in


మేనేజ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 05
► పోస్టుల వివరాలు: డైరెక్టర్‌(అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌)–01, రీసెర్చ్‌ అసోసియేట్‌ (అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌)–01, రీసెర్చ్‌ అసోసియేట్‌(నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌)–01, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌–01, అసిస్టెంట్‌ క్యాషియర్‌–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌), రాజేంద్రనగర్, హైదరాబాద్‌–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
► వెబ్‌సైట్‌: https://www.manage.gov.in


టీఎస్‌ పోస్టల్‌ సర్కిల్‌లో 55 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 55

► పోస్టుల వివరాలు: పోస్టల్‌ అసిస్టెంట్‌–11, సార్టింగ్‌ అసిస్టెంట్‌–08, పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్‌–26, ఎంటీఎస్‌–10.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి.

► వయసు: పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌/పోస్ట్‌మ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్‌ తదితరాలు.

► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

► వెబ్‌సైట్‌: https://tsposts.in

మరిన్ని వార్తలు