ఘనంగా నృసింహుడి ఎదుర్కోలు 

3 Feb, 2023 02:22 IST|Sakshi
సింహ వాహన అలంకార సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు  

యాదగిరిగుట్ట: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్లకు గురువారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం హవన పూజలు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్టానాలు, పారాయణికులతో వేద పారాయణాలు జరిపించిన అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను సింహవాహనం సేవపై తిరువీధుల్లో ఊరేగించారు.

సాయంత్రం జరిగిన ఉత్సవంలో శ్రీస్వామి వారిని అశ్వవాహనంపై మేళతాళాలతో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదుర్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.  

మరిన్ని వార్తలు