భారత్‌కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

22 May, 2021 11:49 IST|Sakshi

యుద్ధప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి

ఒక్కో క్రయోజనిక్ ట్యాంకర్‌లో 1.40 లక్షల లీటర్ల ఆక్సిజన్ 

దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి

ఆక్సిజన్‌ ట్యాంకర్లను దిగుమతి చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌కు థాయ్‌లాండ్‌ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్‌లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో‌ భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ(ఎంఈఐఎల్‌) థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్‌కు దిగుమతి చేస్తోంది.

తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేకంగా డిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్‌ ట్యాంకర్లను రప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ ఆక్సిజన్‌ ట్యాంకర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది.

చదవండి:
మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

Corona: వ్యాక్సిన్‌ కోసం వేరే దేశాలకు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు