సాగర్‌కు స్మార్ట్‌ బోట్‌

4 Sep, 2020 11:48 IST|Sakshi
దయ్యాలగండి సమీపంలోని సమ్మక్క–సారక్క పుష్కరఘాట్‌ వద్ద లాంచీని నీటిలోకి దింపుతున్న సిబ్బంది

సాక్షి. నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌కు మరో స్మార్ట్‌ బోటు వచ్చింది. ఈ బోటును విశాఖ పట్టణానికి చెందిన సెకాన్‌ కంపెనీ తయారు చేసింది. రెండు రోజుల క్రితమే సాగర్‌కు చేరుకుంది. గురువారం దయ్యాలగండి సమీపంలోని సమ్మక్క–సారక్క పుష్కరఘాట్‌నుంచి నీటిలోకి దింపారు. ఈ బోట్‌లో 60మంది పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు. గతంలో 100 మంది చొప్పున  ప్రయాణం చేసే పాల్గున, న్యూలాంచీలు ఉన్నాయి. దీంతో పర్యాటకులకు మూడు లాంచీలు నాగార్జునకొండకు, శ్రీశైలం వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చాయి.గత ఏడాది గోదావరి నదిలో ఆంధ్రాప్రాంతంలో జరిగిన ప్రమాదంతో నాగార్జునకొండకు వెళ్లే లాంచీలను నిలిపి వేశారు.

సాగర్‌ జలాశయం మధ్యలోగల నాగార్జునకొండ ఆంధ్రా ప్రాంతంలో ఉంది. తెలంగాణ ప్రాంతంనుంచి నాగార్జునకొండకు లాంచీలు నడపాలంటే ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రా లాంచీలు పాతవి కావడంతో వారికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. తెలంగాణ లాంచీలు కొత్తవి కావడంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు సమర్పించారు. ఈలోపు కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. దీంతో అనుమతులు ఆగిపోవడంతోపాటు లాంచీలు నడపడమే నిలిపివేశారు. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిసేత్‌ శ్రీశైలం, నాగార్జునకొండలకు లాంచీలను నడపడంతోపాటు ఉన్నతాధికారులు, ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అద్దెకిచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు