అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ముగిసిన భేటీ

24 Aug, 2020 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు బస్సు సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో సర్వీసులను ప్రారంభించాలని సూచనప్రాయంగా అంగీకరానికి వచ్చినట్టు తెలిసింది. 256 సర్వీసులు ఏపీ నుంచి తెలంగాణకు నడపాలని ఏపీ అధికారులు సూచించినట్టు సమాచారం. తెలంగాణలో ఏపీ బస్సులు 1,11,000 కిలోమీటర్లు తిరుగుతున్నాయని వాటి సర్వీసులు తగ్గించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు కోరినట్టు తెలిసింది. విభజన జరిగిన తర్వాత ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అమలు కాలేదన్న దానిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మరోసారి భేటి కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల ప్రారంభంపై వచ్చే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కరోనా నేపథ్యంలో అమలవుతోన్న అన్‌లాక్ అనంతరం కూడా అంతరాష్ట్ర బస్సులు నడిపే యోచనలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన సమావేశంలో ఏపీ ఈడీ బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ ఈడీలు యాదగిరి, పురుషోత్తం నాయక్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు