అంతరాష్ట్ర​ బస్సులు: మంత్రుల భేటీ లేదు

12 Sep, 2020 12:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు. కిలోమీటర్ బేసిస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుంది. అప్పటిదాకా కేవలం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయి’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న (సోమవారం) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇటీవల లాక్‌డౌన్‌ ఎత్తివేడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా