కేసీఆర్‌కు సీఎం జగన్‌ బర్త్‌ డే విషెష్‌

17 Feb, 2021 17:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కేసీఆర్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, సామాజిక‌వేత్త‌లు, హ‌రిత ప్రేమికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యడియూర‌ప్ప, త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్‌దేవ్ కుమార్ త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 

సీఎం కేసీఆర్‌‌ పుట్టినరోజు సందర్భంగా నేడు కోటి వృక్షార్చన

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు