అరకు ప్రమాదం: హుషారుగా వెళ్లి.. విషాదంగా..

14 Feb, 2021 08:14 IST|Sakshi
షేక్‌పేట్‌లో మృతురాలు లత ఇంటి వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు 

విశాఖ నుంచి బయల్దేరిన 16 మంది అరకు ప్రమాద బాధితులు  

డ్రైవర్‌ సహా మిగతా ఏడుగురికి అక్కడే వైద్యం  

సాక్షి, హైదరాబాద్‌: అరకు లోయలో బస్సు పడిన ప్రమాద ఘటన బాధితులు శనివారం రాత్రి నగరానికి బయలుదేరారు. నలుగురి మృతదేహాలను సైతం ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించారు. షేక్‌పేట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదం నుంచి బయట పడిన 16 మందిని భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. శుక్రవారం అరకు లోయలో బస్సు పడిపోయిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 23 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో కలిసి మొత్తం 27 మంది హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి విశాఖలో అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు.

విహార యాత్రకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో..

ప్రమాదం తర్వాత విశాఖ నుంచి తిరిగి వస్తూ..

ప్రమాదం నుంచి త్రుటిలో బయటిపడి ఇళ్లకు చేరుకోవడంతో 16 మంది కుటుంబ సభ్యులకు కొంత ఊరట కలిగించింది. మృతుల కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా.. శనివారం ఉదయం అరకు లోయ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను  పరామర్శించేందుకు సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంత కుమారి, షేక్‌పేట్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ విశాఖపట్నం వెళ్లారు. మృతులు, గాయపడిన కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు కూడా అక్కడికి బయలుదేరారు. వీరు విశాఖపట్నానికి వెళ్లేందుకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ విమాన టికెట్లు అందించారు.

చదవండి: కామారెడ్డిలో ఆర్టీసీ బస్‌ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు