ఫేస్‌బుక్‌ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం.. యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి

12 Oct, 2022 14:21 IST|Sakshi
ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ  

సాక్షి, వికారాబాద్‌: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్‌ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్‌ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్‌ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు.

కేసును నీరుగార్చే యత్నం 
రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్‌ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. 
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం: కదులుతున్న డొంక

మరిన్ని వార్తలు