సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

3 Oct, 2020 20:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈసారి రాష్ట్రం నుంచి 46,171 మంది సివిల్స్‌ పరీక్షలు రాయనున్నారు. అందుకు హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్స్‌ పరీక్ష రాయనున్న అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. సివిల్స్‌ పరీక్ష రెండు సెషన్స్ లో జరగనుంది. 

కాగా మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం  2.30నుంచి సాయంత్రం 4. 30 వరకు రెండవ సెషన్‌లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని.. అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌లో జరగనున్న సివిల్స్‌ పరీక్షా కేంద్రాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు