పీవీపీకి హైకోర్టులో ఊరట

7 Aug, 2020 04:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో పారిశ్రామికవేత్త ప్రసాద్‌ వీర పొట్లూరి (పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈనెల 18 వరకు ఆయన్ను అరెస్టు చేయడం లాంటి చర్య లేవీ చేపట్టవద్దని న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి గురువారం ఆదేశించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పీవీపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తనపై కేసును కొట్టివేయాలని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41–ఎ కింద నోటీసు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ఇలా వేర్వేరుగా పీవీపీ 3 పిటిషన్లు దాఖలు చేశారని ఫిర్యాదుదారుడి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హమేకాదని తెలిపారు. 3 పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని, ముందస్తు బెయిల్‌పై వాదనలు వినాలని పీవీపీ తరఫు న్యాయవాది, ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పం దించిన కోర్టు, పీవీపీని అరెస్టు చేయడం లాంటి చర్యలేవీ చేపట్టరాదని బంజా రాహిల్స్‌ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.  
 

>
మరిన్ని వార్తలు