‘వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’

28 Jul, 2020 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమృత, మారుతీరావులపై మర్డర్ సినిమా తీయటం రామ్‌గోపాల్‌వర్మ శాడిజానికి ప్రతీక అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు.. వారి సామాజిక వర్గాన్ని బజారున పడేయటం హేయమైన చర్య. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్‌’ ట్రైలర్‌)

మారుతీరావు సాధుజీవి, అటువంటి వ్యక్తిని మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరం. అమృత, మారుతీరావులను.. ఒకరు ప్రేమించి తప్పు చేయటం, మరొకరు హత్య చేయించడం ద్వారా ఇద్దరినీ విలన్లుగా సృష్టించటం వర్మ పబ్లిసిటీకి పరాకాష్ట. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారు. వర్మ మా డిమాండ్‌కు తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు' అంటూ రామకృష్ణ హెచ్చరించారు. (అమృతా ప్రణయ్‌ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్‌..)

మరిన్ని వార్తలు