Asara Pension: 57 ఏళ్లు నిండిన వారికి.. ఈనెల 31 వరకు గడువు

17 Aug, 2021 08:49 IST|Sakshi
నెన్నెల మీసేవ కేంద్రంలో దరఖాస్తుదారులు

సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్‌): ఆసరా పింఛన్‌ కోసం 57 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు మీసేవ, ఈసేవ కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నూతనంగా పింఛన్‌ పొందేందుకు అర్హతలు కలిగి ఉన్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.  

మూడేళ్ల క్రితమే సర్వే.. 
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు మూ డేళ్ల క్రితమే జిల్లాలో సర్వే నిర్వహించా రు. ఓటరు జాబితా ఆధారంగా కొత్తగా జిల్లాల్లో 32 వేల మంది వృద్ధాప్య పింఛన్‌కు అర్హత కలిగి ఉన్నారని గుర్తించారు. సర్వే తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రస్తుతం 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్‌లు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

మీసేవ.. ఈసేవ కేంద్రాల్లో.. 
నూతనంగా పింఛన్‌ పొందేందుకు అర్హులు దరఖాస్తులను మీసేవ, ఈసేవ కేంద్రాల్లో అందజేయాలి. వయస్సు నిర్ధారణ కోసం పాఠశాలలో జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డులో నమోదైన తేదీని పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి సేవా రుసుం తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. అందరికీ తామే చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.  

మరిన్ని వార్తలు