ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్‌ వంటలక్క! 

29 Oct, 2021 09:50 IST|Sakshi

కార్తీకదీపం వంటలక్క ఫేమ్‌ ఇంటికే పరిమితం కాలేదు. ఇప్పుడు పంట చేల దాకా పాకింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు చేలలో దిష్టి బొమ్మలు పెడతాం. వీటికి బదులు హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలి ట్రెండ్‌ అయింది.

అంతకుమించి అభిమానాన్ని చూపించాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో ఓ రైతు... వేరుశనగ చేనులో కార్తీక దీపం సీరియల్‌ ఫేమ్‌ వంటలక్క దీప ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. ఆ దారి గుండా వెళ్లే వారు ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రైతు క్రియేటివిటీకి ఆశ్చర్యపోతున్నారు.  
– అశ్వారావుపేట రూరల్‌
చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్‌ వంటలక్క!  

మరిన్ని వార్తలు