వైద్యుల పట్ల దృక్పథం మారాలి

21 Sep, 2020 05:06 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల పట్ల ప్రజల దృ క్పథంలో మార్పు రావాలని, వారి సేవలు, ఇబ్బందులను ప్రజలు గుర్తించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. వైద్యులపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ స్పెషాలిటీ స్‌ కాన్వొకేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు.

వైద్యులు సమర్థవంతమైన సేవలు అందిస్తుండడంతో దేశంలో కరో నా మరణాల రేటు (సీఎఫ్‌ఆర్‌) చాలా తక్కు వగా ఉందన్నారు. కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బందిలో మరణాల రేటు 15 శాతం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్‌ శర్మ, సెక్రటరీ జనరల్‌ అశోకన్, ఐఎంఏ వైస్‌ చైర్మ న్‌ అష్రఫ్, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు