రాజ‌కీయ‌నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానాలు

19 Sep, 2020 13:54 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట :  కోమురవేల్లి మల్లికార్జున స్వామి దేవాల‌య భూ క‌బ్జాపై 'సాక్షి'లో వ‌చ్చిన క‌థ‌నంపై అధికారులు స్పందించారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. రాజీవ్ ర‌హ‌దారికి అనుకొని ఉన్న 7ఎక‌రాల  దేవాల‌య స్థ‌లాన్ని భూ భ‌కాసురులు క‌బ్జా చేసిన తీరును సాక్షి టీవీ ప్ర‌సారం చేసింది. దీంతో భూ క‌బ్జాదారుల‌పై చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించారు. అయితే దీని వెనుక రాజ‌కీయ‌నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.  అందుకే దేవాదాయశాఖ అధికారులు  చర్యలు తీసుకోలేదన్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 100కోట్ల విలువ చేసే  స్థ‌లాన్ని ఆక్ర‌మించేసి ఇల్లు నిర్మాణం చేప‌ట్టినా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అంతేకాకుండా దీని వెనుక రెవెన్యూ అధికారుల హ‌స్తం కూడా ఉందేమో అని భ‌క్తులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విఙ్ఞ‌ప్తి చేస్తున్నారు. (అరకొరగానే సహకారం: రూ.25లక్షలు అవసరం)

మరిన్ని వార్తలు