సోలార్‌ ‘ఆటో’ కూల్‌

8 May, 2022 01:05 IST|Sakshi

నర్సాపూర్‌(జి): ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయట కాలుపెట్టేందుకు జనాలు జంకుతున్నారు. మరి పనిచేస్తే గానీ పూట గడవని వారి పరిస్థితి ఏంటి? అందుకే నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ సుదర్శన్‌ ఎండ నుంచి ఉపశమనానికి తన ఆటోలో చిన్న కూలర్‌ అమర్చుకున్నాడు. ఆటోపై సోలార్‌ పలకలను అమర్చాడు. దాని నుంచి వచ్చే విద్యుత్‌తో ఆటోలో అమర్చిన కూలర్‌ చల్లదనాన్ని ఇస్తోంది. అటు ప్యాసింజర్లూ చల్లగా ప్రయాణిస్తూ ఐడియా అదిరింది గురూ అంటున్నారు.   

మరిన్ని వార్తలు