తెలంగాణలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్.. 6.30 వరకే ఆ‌ దుకాణాలు 

11 Apr, 2021 00:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌(టూ, త్రీ వీలర్‌) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు