డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భంలో బిడ్డ మృతి

21 May, 2021 10:24 IST|Sakshi
ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి (ఫైల్‌)

ఆపరేషన్‌కు నిరాకరించిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు

ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్‌ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్‌ చేయడం కుదరదని, వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్‌డౌన్‌లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా  ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం 
ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్‌ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు.

చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు..
చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా..

మరిన్ని వార్తలు