రూ.4.50 లక్షలకు పసికందు అమ్మకం 

15 Jul, 2021 04:28 IST|Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌) : పుట్టిన నాలుగు రోజులకే పసికందును విక్రయించిన మహిళతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన అనూషకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత శనివారం రహ్మత్‌నగర్‌ సమీపంలోని ఓ ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును విక్రయించేందుకు అంతకుముందే రూ.4.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో డబ్బు తీసుకుని పసి కందును అప్పగించారు. ఈ వ్యవహారం పోలీసులదాకా వెళ్లడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన సంతోషిని అదుపులోకి తీసుకొని వారు ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యక్తి రూ.4.50 లక్షలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేశాడని, మధ్యవర్తిగా తనకు రూ. 50 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని బుధవారం అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు