Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్‌

28 Aug, 2021 12:42 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్‌ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.

ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్‌ బస్సులో బయలుదేరారు. అమీర్‌పేట్‌ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్‌ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్‌ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్‌​ ఇన్‌స్పెక్టర్‌ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్‌ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు