ప్రజారోగ్య సంచాలకుడి అక్రమాలపై విచారణకు డిమాండ్‌ 

23 Jan, 2022 04:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించా నని, మార్చి 9న హాజరు కావాలని లోకాయుక్త సమన్లు జారీ చేసిందని తెలిపారు. మందుల కొనుగోలులో అక్రమాలు, కోవిడ్‌–19 మరణా ల సమాచారంలో తప్పుడు లెక్కలు, వైద్యుల బదిలీలు, పదోన్నతుల్లో అవక తవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు