జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

1 Apr, 2022 12:49 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో రెండున్నర కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు చెప్పారు. 

సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, సీఈ సీతారాములు, ఈఓ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, వాటర్‌వర్క్స్‌ జీఎం హరిశంకర్, ఆలయ ట్రస్టీ సాయిబాబాగౌడ్, కమిటీ సభ్యులు అశోక్‌యాదవ్, హనుమంతరావు, ఉమానాథ్‌గౌడ్, బలరాం, శ్రీనివాస్‌గుప్తా, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.  (క్లిక్‌: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు