కామారెడ్డిలో కొనసాగుతున్న బంద్‌.. బీజేపీ నేతలు హౌస్‌ అరెస్ట్‌!

6 Jan, 2023 11:57 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్‌ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్‌ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్‌, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. 

ఇదిలా ఉండగా.. మాస్టర్‌ ప్లాన్‌కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్‌ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్‌.. జై కిసాన్‌ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. 

ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్‌ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. మాస్టర్‌ ప్లాన్‌ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్‌ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్‌ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక, రైతులకు కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. మాస్టర్‌ ప్లాన్‌ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్‌ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు