క్షీణించిన బండి సంజయ్‌ ఆరోగ్యం

27 Oct, 2020 20:57 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న దీక్షకు భగ్నం కలిగింది. సోమవారం రాత్రి నుంచి దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఆస్పత్రి వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం అంబులెన్స్‌లో అపోలో రీచ్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. చదవండి: బండి సంజయ్‌ అరెస్ట్; సీఎస్‌, డీజీపీకి నోటీసులు

కాగా సోమవారం సాయంత్రం సిద్ధిపేటకు వెళ్తున్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి  కరీంనగర్‌ తరలించారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు