అంబేద్కర్‌‌కు బండి సంజయ్‌ నివాళి

6 Dec, 2020 09:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అన్నారు. ఆదివారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర ఆయన ‌​విగ్రహానికి​ బండి సంజయ్ పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే తరాలకు న్యాయం జరగాలి చాటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్‌ అని గుర్తుచేశారు. ఆయన జయంతి, వర్ధంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

అంబేద్కర్‌ చరిత్ర భావి తరాలకు చెప్పాలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయితే అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి రోజున బయటికి రాలేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. మొన్ననే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, అంబేద్కర్‌‌ను స్మరించుకుంటే కనీసం జ్ఞానమైన వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే బాబా సాహెబ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు