కవితకు నోటీసులు.. బండి సంజయ్‌ రియాక్షన్‌ ఇదే..

8 Mar, 2023 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహరం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లిక్కర్‌ స్కాంపై తెలంగాణ బీజేపీ నేతలు కవితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

తాజాగా, లిక్కర్‌ స్కాంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈడీ నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు స్వచ్చందంగా పనిచేస్తాయి. లిక్కర్‌ స్కాం కేసులో నిందితులు నాకు తెలుసని గతంలో కవితే చెప్పారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలి. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంత వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. 

మరోవైపు, లిక్కర్‌ స్కాంపై డీకే అరుణ స్పందిస్తూ.. లిక్కర్‌ స్కామ్‌లో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కవిత పాత్ర లేకపోతే అదే విషయాన్ని ఈడీకి చెప్పాలి అని కామెంట్స్‌ చేశారు.  

మరిన్ని వార్తలు