హైదరాబాద్‌లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి

5 Apr, 2022 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు.

హైదరాబాద్‌ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్  చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చిన స్కూల్‌ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
చదవండి: Drugs Case: డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్‌

కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు.

మరిన్ని వార్తలు