ఇతగాడి పెండింగ్‌ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. 

25 Jun, 2021 12:05 IST|Sakshi
పెండింగ్‌ చలానాలను పరిశీలిస్తున్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకన్న   

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ ద్విచక్ర వాహనదారుడు రణదీర్‌ కొన్నాళ్లుగా పెండింగ్‌ చలానాలతో తప్పించుకు తిరుగుతూ దొరికిపోయాడు. పోలీసులు పరిశీలించగా ఈ యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనంపై 90చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రూ.21,510 జరిమానాలు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులు వాటిని అప్పటికప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. పెండింగ్‌ లిస్టు చూసి పోలీసులు ముక్కుమీద వేలేసుకున్నారు.

చదవండి: 28 నెలలకే జన్మించిన శిశువు..

>
మరిన్ని వార్తలు