కరిగిపోతున్న ప్రకృతి సంపద: అప్పుడలా.. ఇప్పుడిలా!

3 Aug, 2021 10:18 IST|Sakshi

సాక్షి, కరీనంగర్‌: ప్రకృతి సంపద కరిగిపోతోంది.. ఆహ్లాదం పంచే గుట్టలు కనుమరుగవుతున్నాయి.. గ్రానైట్, క్రషింగ్‌ తదితర చర్యలతో అంతరించిపోతోంది. సహజసిద్ధమైన గుట్టలపై ఉన్న చెట్ల సంపద కూడా తరిగిపోతుంది. గుట్టలు తవ్వి అక్రమార్కులు రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. పెద్ద మొత్తంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అలనాటి పచ్చదనం కాస్త కాంట్రాక్టర్లకు పసిడి తనంగా మారిపోతుంది. అక్రమార్కుల చేతిలో కొండలు, గుట్టలు రోజురో జుకూ కరిగిపోతున్నాయి. 

2017 లో సగం వరకు ‘సాక్షి’ కెమెరాకు కనిపించిన బసంత్‌నగర్‌ సమీపంలోని అతిపెద్ద గుట్ట క్రషింగ్‌తో ఆగస్టు 2, 2021 వరకు ఇలా అడుగంటి అంతరించిపోతోంది.. మరో నాలుగేళ్లకు ఇక్కడ గుట్ట ఉండేదట అని చెప్పుకోవాల్సిన వస్తోందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పర్యావరణానికి తీరని నష్టం వాటిలుతున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపులేకుండా పోతుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి 

మరిన్ని వార్తలు