మంత్రి సబితా ఇంటి ముందు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

31 Jul, 2022 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో శ్రీనగర్‌ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాసర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన పేరెంట్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  మరోవైపు మంత్రి ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. 

ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ. తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు వెల్లడించారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల హెచ్చరించారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు