Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం 

17 Oct, 2021 08:39 IST|Sakshi

బాసరలో ముగిసిన ఉత్సవాలు
భైంసా(ముధోల్‌): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్‌లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు.   

ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
సాక్షి వరంగల్‌: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లా‹స్‌ (టీప్యాడ్‌) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్‌లోని బిగ్‌ రాంచ్‌లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. 

ప్రగతిభవన్‌లో ఆయుధ పూజ 
సాక్షి, హైదరాబాద్‌: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభమ్మ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు