సంబురాల స‌ద్దుల బ‌తుక‌మ్మ‌

24 Oct, 2020 19:26 IST|Sakshi

సాక్షి, వ‌రంగ‌ల్ : జిల్లాలో సద్దుల బ‌తుక‌మ్మ సంబురాలు  జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఆడ‌ప‌డుచులు ఆనందోత్స‌వాల మధ్య ఆడిపాడి బ‌తుమ్మ పండుగ‌ను జ‌రుపుకున్నారు. అయితే ప్ర‌తీ ఏడాది ఉండే కోలాహ‌లం, ర‌ద్దీ మాత్రం క‌నిపించ‌లేదు. చాలామంది మ‌హిళ‌లు వారి ఇళ్ల‌లోనే బ‌తుక‌మ్మ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇక వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ ఆడ‌ప‌డుచులంద‌రికీ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. శనివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్‌లో బతుకమ్మ ఆడుతున్న ప్ర‌దేశానికి చేరుకున్న మంత్రి కోవిడ్ ఆంక్ష‌లు పాటిస్తూ పండుగ జ‌రుపుకుంటున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు