బీడీఎల్, హైదరాబాద్‌లో 46 ఖాళీలు

5 Jul, 2021 13:59 IST|Sakshi

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌–01, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–03, మెడికల్‌ ఆఫీసర్‌–02, అసిస్టెంట్‌ మేనేజర్‌–03, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ–37.
► విభాగాలు: హెచ్‌ఆర్, న్యూప్రాజెక్ట్స్, సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఆప్టిక్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత 
సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్‌/ఎంఎస్‌/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: జనరల్‌ మెడిసిన్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మెడికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా; మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష(కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
►ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021

►దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 27.07.2021
►వెబ్‌సైట్‌: https://bdl-india.in/careers-page

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు