చిట్యాలలో ఎలుగుబంటి హల్‌చల్‌

15 May, 2021 14:18 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది.

చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు 
మంచె మీదే బీటెక్‌ విద్యార్థి ఐసోలేషన్‌.. చెట్టుమీదే 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు