బేగంపేటలో కిడ్నాప్‌ కలకలం.. సొంత ఊరికి వచ్చాను!

29 Jun, 2021 07:29 IST|Sakshi

తన భర్తను కిడ్నాప్‌ చేశారంటూ ఆడిటర్‌ భార్య ఫిర్యాదు.. 

సొంత ఊరికి వచ్చానంటూ వీడియో కాల్‌ ద్వారా ఆడిటర్‌ సమాచారం 

∙సాక్షి, సనత్‌నగర్‌: బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ కలకలం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టింంది. ఆడిటర్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని పోలీసులకు అందిన ఫిర్యాదు వారిని హైరానా పెట్టింది. చివరకు క్షేమంగా ఉన్నట్లు వీడియో కాల్‌ ద్వారా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండకు చెందిన సాంబశివరావు ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ సికింద్రాబాద్, భరణీ కాంప్లెక్స్‌లోని తన కార్యాలయానికి వెళ్లేవాడు. ఆదివారం ఆఫీసుకు వెళ్లిన సాంబశివరావు రాత్రికి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం కనిపించ లేదు.

అయితే బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని సాంబశివరావు బంధువు ఇంటి వద్ద అతని కారు ఉన్నట్లు తెలిసింది. అతనికి భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో దగ్గరి బంధువులే  కిడ్నాప్‌ చేసి ఉంటారనే అనుమానంతో అతడి భార్య సరిత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందుబాటులోకి వ్చన సాంబశివరావు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావుతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తాను క్షేమంగా ఉన్నానని, బంధువులతో తన స్వస్థలమైన ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’

మరిన్ని వార్తలు