Bhadradri FRO Murder: గంజాయి, నాటుసారా మత్తులో గుత్తి కోయలు! ప్రాణహాని ఉందంటూ..

26 Nov, 2022 18:16 IST|Sakshi

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది.

సాక్షి, భద్రాద్రి జిల్లా: ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమై గుత్తి కోయలను బహిష్కరిస్తూ శనివారం బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ ముక్తకంఠంతో ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సందర్భంగా.. 

బెండాలపాడు గ్రామస్తులు గుత్తి కోయలపై పలు ఆరోపణలు చేశారు. గుత్తి కోయలు రోజూ గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని, వాళ్ల వల్ల తమకూ ప్రాణహాని పొంచి ఉందని ఆ తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు గుత్తి కోయలను వాళ​ స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్‌ ఎఫ్‌ఆర్వో చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు