Shilpa Layout Flyover: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్‌ఆర్‌కు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు

26 Nov, 2022 09:33 IST|Sakshi

సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రయ్‌.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్‌లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది.  

ఏర్పాట్లు ఇలా..  
♦ మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. 
♦ ఫ్లై ఓవర్‌ ఎక్కిన వాహనాలు ఓల్డ్‌ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్‌ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. 
♦ ఔటర్‌ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్‌ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్‌ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్‌ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్‌ ఏర్పాటు  చేశారు.  
♦ ఫ్లై ఓవర్‌ ముగియగానే,  లెఫ్ట్‌ తీసుకొని డెలాయిట్‌ రోడ్డులో మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు.  

సాఫీగా ప్రయాణం..  
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి ప్రసాద్‌ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు జంక్షన్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 45కు వెళతాయి.  

♦ అక్కడ కేబుల్‌ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్‌ హోటల్‌ , మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌ దిగిన వెంటనే లెఫ్ట్‌ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్‌ టర్న్‌ తీసుకుంటే శిల్ప లేఅవుట్‌లోని ఫ్లై ఓవర్‌ పై నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకోవచ్చు.  

♦ జూబ్లీహిల్స్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్‌ విమానాశ్రయం, బెంగళూర్‌ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్‌పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్‌చెరు వైపు వెళ్లవచ్చు.  

♦ ఫ్లైఓవర్‌ నుంచి ఓల్డ్‌ ముంబయ్‌ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. 
♦ శంషాబాద్‌ విమానాశ్రయం, పటాన్‌చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్‌ చేరుకోవచ్చు.   

జంక్షన్‌లపై తగ్గనున్న ఒత్తిడి 
♦  ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్‌ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌కు వెళుతుంటాయి.  లేదా గచి్చ»ౌలి జంక్షన్‌ నుంచి అంజయ్యనగర్‌లో రైట్‌ టర్న్‌ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్‌ స్పేస్‌ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. 
♦  శిల్ప లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్‌ వైపు వెళ్లాల్సిన పని లేదు. 
♦  దీంతో గచ్చిబౌలి జంక్షన్‌లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది.

ప్రాజెక్ట్‌ వ్యయం రూ.466 కోట్లు  
►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) 
►లైన్లు నాలుగు లేన్ల బై  డైవర్షనల్‌ ఫ్లై ఓవర్‌  
►మెయిన్‌ ఫ్లైఓవర్‌ 956 మీటర్లు 
►ఎగువ ర్యాంప్‌ 456.64 మీటర్లు 
►దిగువ ర్యాంప్‌ 399.95 మీటర్లు 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు