రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!

19 May, 2022 11:42 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం రూరల్‌: అదొక సాధారణ డాబా ఇల్లు. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక కూలర్, ఐదు బల్బులు మాత్ర మే ఉన్నాయి.. ఆ కుటుంబం నెల రోజులకు 117 యూనిట్ల విద్యుత్‌ వినియోగించింది. కానీ బిల్లు మాత్రం రూ.7,02,825 వచ్చింది. దీం తో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్‌ ఇంటికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.700 విద్యుత్‌ బిల్లు వచ్చేది.

కానీ బుధవారం తీసిన రీడింగ్‌లో మాత్రం రూ.7 లక్షలకు పైగా బిల్లు రావడంతో ఆయన బెంబేలెత్తిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో లేదా మెషీన్‌లో లోపం వల్లే బిల్లు వచ్చిందని, నెల రోజు లకు తాము వినియోగించింది 117 యూనిట్లేనని సంపత్‌ వాపోతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీనిపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సురేందర్‌ మాట్లాడుతూ.. సంపత్‌ ఇంటికి వచ్చిన బిల్లు రూ.625 మాత్రమేనని, రీడింగ్‌ మిషన్‌లో లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. 
చదవండి: పంజగుట్ట: మేనేజర్‌ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..

మరిన్ని వార్తలు