బీటీపీఎస్‌లో నాలుగో యూనిట్‌ సింక్రనైజేషన్‌ 

15 Oct, 2021 01:51 IST|Sakshi
భద్రాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో సింక్రనైజేషన్‌  ప్రక్రియను పరిశీలిస్తున్న డైరెక్టర్‌   

ఈ ఏడాది చివరినాటికి సీఓడీ పూర్తిచేస్తాం

ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.సచ్చిదానందం

మణుగూరు టౌన్‌: తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పాటుచేసిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో చివరిదైన నాలుగో యూనిట్‌ సింక్రనైజేషన్‌ (బొగ్గును మండించే ప్రక్రియ)ను ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.సచ్చిదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణుగూరు భద్రాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో 270 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్ల నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మూడు యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా, నాలుగో యూనిట్‌ పనులను ఇప్పుడు సింక్రనైజేషన్‌ చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ యూనిట్‌ నిర్మాణం పూర్తిచేసి సీఓడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లేర్డ్‌) చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈమేరకు సింక్రనైజేషన్‌ విజయవంతంగా పూర్తిచేసిన సీఈ బాలరాజు, అధికారులను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు